విశాఖ జిల్లా మునగపాకలో కొణతాల రామకృష్ణ తన అనుచరులతో సమావేశమయ్యారు. తెదేపాలో చేరుతున్నట్లు కొణతాల ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక తరఫున ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా... ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి చదవండి