ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలి'

ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసొసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోవాడ వీర్రాజు అన్నారు. విశాఖ ఏయూలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Andhra Pradesh SC, ST, BC, Minority Employees and Professionals Association meeting in vizag
విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కళాశాలలో సమావేశం

By

Published : Mar 21, 2021, 5:17 PM IST

విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసొసియేషన్ సంఘ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేధావులు, ఆచార్యులు, డాక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలని గోవాడ వీర్రాజు పిలుపునిచ్చారు. దీని కోసం అన్ని వర్గాల ప్రజాస్వామ్య వాదులు ఏకం కావాలని కోరారు. ప్రజలకు రాజ్యంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజల ఐక్య పోరాటం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసొసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోవాడ వీర్రాజు అన్నారు. దళితులు, మైనార్టీలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన ఓటు బ్యాంక్ ఉన్న తాము... సొంతంగా రాజకీయ పార్టీగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవితను అందించడానికి అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని గోవాడ వీర్రాజు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details