ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 7, 2020, 4:24 PM IST

Updated : Jun 7, 2020, 4:32 PM IST

ETV Bharat / state

అనకాపల్లి నూకాలమ్మ దర్శనం.. ఇప్పట్లో లేనట్లే!

లాక్​డౌన్ సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ.. అనకాపల్లి నూకాలమ్మ దేవస్థానం మాత్రం తెరుచుకునే అవకాశం ఇప్పట్లే లేదు. కరోనా కేసులు పెరగడం.. ఆలయం కంటైన్మెంట్​ జోన్​ పరిధిలో ఉండటమే ఇందుకు కారణం.

Anakapalli Nukkalamma temple not open due to corona positive cases in anakapalli in visakhapatnam district
Anakapalli Nukkalamma temple not open due to corona positive cases in anakapalli in visakhapatnam district

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న అనకాపల్లి నూకాలమ్మ దర్శన భాగ్యం.. ఇప్పట్లో భక్తులకు లభించే అవకాశం కనిపించడం లేదు. లాక్​డౌన్ సడలింపుతో ఈ నెల 8 నుంచి దేవాలయం తెరవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

కానీ... అనకాపల్లి పట్టణంలో కరోనా కేసులు పెరగడం... అమ్మవారి దేవస్థానం కంటైన్మెంట్​ జోన్​ పరిధిలో ఉండటమే ఇందుకు కారణమైంది. తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నామని.. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు.

Last Updated : Jun 7, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details