విశాఖ జిల్లా అనకాపల్లి బుద్ధ నూకయ్య కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబీకులు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పై అంతస్తులోని ఇంట్లోకి వెళ్లిన దుండగులు తలుపులను కోసి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, 80 వేల నగదును ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తలుపులు ధ్వంసం చేసి.. ఇంట్లో చోరీ - police
అనకాపల్లి లక్ష్మీదేవిపేటలోని బుద్ధ నూకయ్య కాలనీలో ఇంట్లో చోరీ జరిగింది. తలుపులను కోసి ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
దోపిడీ