జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని అనకాపల్లి బెల్లం మార్కెట్‌కి నేడు భారీగా బెల్లం వచ్చింది. ఏ ఫ్లాట్ ఫారం చూసినా బెల్లం దిమ్మలతో కళకళలాడాయి. ఒక్కరోజులో 24,512 దిమ్మెలు మార్కెట్కిి వచ్చాయి. ఈ ఏడాది ఇదే అత్యధిక మని వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
అనకాపల్లి మార్కెట్‌కు.. భారీగా తరలివచ్చిన బెల్లం - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని అనకాపల్లి మార్కెట్‌కు బెల్లం రికార్డు స్థాయిలో చేరుకుంది. ఈ ఏడాది ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం ధరలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి మార్కెట్‌కు.. భారీగా తరలివచ్చిన బెల్లం
సంక్రాంతి పండుగ ముగియడంతో రైతులు బెల్లం తయారీ చేపట్టారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు బెల్లం తయారీని జోరుగా కొసాగిస్తున్నారు. కానీ ధరలు మాత్రం తక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగు బెల్లం 10 కేజీలు రూ. 319 ధర పలకగా.. మధ్య రకాలు రూ. 288, నాసిరకం రూ. 284 ధర పలికాయి.
ఇదీ చదవండి:రబీ సాగుకు.. కోనాం జలాశయ నీటి విడుదల