ఆచార్య NGరంగా వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలోని విశాఖ జిల్లా అనకాపల్లిలోని పరిశోధనా కేంద్రం(anakapalli research center) అరుదైన ఘనత సాధించింది. బెల్లం పౌడర్, బెల్లం ఉత్పత్తులకు సంబంధించి పేటెంట్(patent) దక్కించుకుంది. బెల్లాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచలేకపోతుండటం గమనించిన శాస్త్రవేత్తలు.... దాన్ని పౌడర్ రూపంలో నిల్వ ఉంచేలా 1994 నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. 2004లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా ఈ ఏడాది మార్చిలో లభించింది. పౌడర్ తయారీ పరికరం కోసమూ పేటెంట్ దరఖాస్తు చేశామని, త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Patent : అరుదైన ఘనత... బెల్లం పౌడర్, బెల్లం ఉత్పత్తుల తయారీకి పేటెంట్ - anakapalli latest news
ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం(anakapalli research center) అరుదైన ఘనత సాధించింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తుల తయారీలో1994 నుంచి చేపట్టిన పరిశోధనలకు పేటెంట్(patent) హక్కు లభించింది. 2004లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా ఈ ఏడాది మార్చిలో లభించింది.
అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి పేటెంట్