అనకాపల్లితో పాటు విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వివరించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో రూ. మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ సత్యవతి పాల్గొన్నారు. రహదారుల, కాలువల కల్వర్టు నిర్మాణానికి మంజూరైన నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారిస్తామన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ శ్రీకారం
అనకాపల్లిలో మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ సత్యవతి శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ శ్రీకారం