విశాఖ జిల్లా గొలుగొండకు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద గుర్తు తెలియని మృతదేహంని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం 30 నుంచి 40 ఏళ్లు గల పురుషుడిదిగా భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ బృందానికి సమాచారం ఇచ్చారు. ఎవరో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - గొలుగొండ వార్తలు
విశాఖ జిల్లా గొలుగొండలో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతునికి 30 నుంచి 40 ఏళ్లుంటాయని తెలిపారు. జిల్లాలో అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన కేసుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
విశాఖ జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గొలుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క జిల్లాలో అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన కేసుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:బైక్ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి