విశాఖపట్నంలోని చీడికాడ మండలం తురువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో అమెరికాలోని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయం ఆచార్య పీటర్ స్మిత్ హెన్నర్ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయలతో కలిసి ఆయన పతకావిష్కరణ చేసి...జాతీయ గీతాలాపన చేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే తనకు ఎంతో ఇష్టమని.. తెలుగు భాష అంటే చాలా అభిమానం అని తెలిపారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పీటర్ స్మిత్‌ను ఘనంగా సన్మానించారు.
భారత్ జాతీయ జెండాను ఎగరవేసిన అమెరికా పౌరుడు - acharya prter smith henner
విశాఖ జిల్లాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో అమెరికాలోని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయం ఆచార్య పీటర్ స్మిత్ హెన్నర్ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన పతాకావిష్కరణ చేసి...జాతీయ గీతాన్ని ఆలపించారు.
జాతీయ జెండాను ఎగరవేసిన వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయం ఆచార్య పీటర్ స్మిత్ హెన్నర్