ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు విశాఖలో అక్కినేని పురస్కార ప్రదానోత్సవం - విశాఖలో అక్కినేని అవార్డుల ప్రదానోత్సవం

పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది. నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్​లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

akkineni awards function in vizag
అక్కినేని అవార్డుల ప్రదానోత్సవం

By

Published : Dec 21, 2019, 9:07 AM IST

పద్మ విభూషణ్, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 6వ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్​లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్​ను అవార్డుల ప్రదానోత్సవ కమిటీ విడుదల చేసింది. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన తొమ్మిది మంది ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్​రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అక్కినేని అవార్డుల ప్రదానోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details