ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు వీవీ రామారావు.. అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. రామారావు మృతిపై.. సీపీఐ నేతలు, విశాఖపట్నం హార్బర్, పోర్టు వర్కర్స్ యూనియన్ నాయకులు సంతాపం ప్రకటించారు.
వీవీ రామారావు విశాఖాట్టణం హార్బర్, పోర్టు వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షునిగా, సీపీఐ విశాఖ కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శి, కార్యవర్గ సబ్యుడిగా, జాతీయ సమితి సభ్యునిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. పోర్టు కార్మికులకు సంబంధించి.. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.