పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన దిల్లీ విద్యార్థులపై... పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయ విద్యార్థులు తప్పుబట్టారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు. మోదీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తూ... విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు ఆగ్రహించారు. లాఠీచార్జీకి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పౌర బిల్లును వ్యతిరేకిస్తూ... విశాఖలో ఏఐఎస్ఎఫ్ ర్యాలీ - aisf rally at vishakapatnam
పౌర బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో... ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును విద్యార్థులు నిరసించారు.
సిటిజన్ బిల్లును వ్యతిరేకిస్తూ విశాఖలో ఏఐఎస్ఎఫ్ ర్యాలీ