ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన - narseepatnam news updates

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గురుకుల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

Agitation protesting the establishment of the Quarantine Center in narseepatnam
క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన

By

Published : Apr 20, 2020, 5:00 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో కరోనా క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి కాలినడకన వచ్చేవారికి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు అధికారులు ఈ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పాఠశాలకు సమీపంలోని ప్రజలు.. క్వారంటైన్ కేంద్రం వల్ల తాము ఇబ్బందులకు గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details