'అంతర్ల' శివాలయంలో అన్నాభిషేకం - మహాశివరాత్రి విశాఖ
మహాశివరాత్రి సందర్భంగా విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక అంతర్ల గ్రామంలోని శివాలయంలో వినూత్నంగా వేడి వేడి అన్నంతో శివుడికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చింతపల్లి గూడెం కొత్తవీధి, జి.మాడుగుల మండలాల్లోని ఆలయాలు సైతం శివనామస్మరణతో మార్మోగాయి.
అంతర్లలో శివునికి అన్నాభిషేకం...భారీగా తరలివచ్చిన భక్తులు