విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధి కీటిన్ పేటలో శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజారోహణం కార్యక్రమం చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులు వేడుకలు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ కె.సూర్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సంతానం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
ఘనంగా శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వరస్వామి ధ్వజారోహణం - భీమిలి
శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన ధ్వజారోహణం కార్యక్రమం విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలో ఘనంగా జరిగింది.
ఘనంగా శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వరస్వామి ధ్వజారోహణం