ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరదా విహారం.. మిగిల్చింది విషాదం - pedderu water canel news

విశాఖ జిల్లా పెద్దేరు జలాశయంలో స్నానం చేస్తుండుగా ప్రమాదవశాత్తు వివాహిత కాలుజారి జలశాయంలో పడింది. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆమె చనిపోయింది. గజ ఈతగాళ్లు మృతదేహం వెలికితీశారు.

a women died in visakha dst pedderu water canel
a women died in visakha dst pedderu water canel

By

Published : May 13, 2020, 1:29 PM IST

విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి సమీపంలోని పెద్దేరు జలాశయం వద్ద.. ప్రమాదవశాత్తూ వివాహిత మరణించింది. విహారం కోసం రావికమతం మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన ఆకెళ్ల శివకుమార్, తులసి దంపతులు.. తమ ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లారు. సరదాగా కుటుంబ సభ్యులంతా స్నానం చేస్తుండగా తులసి (32) ప్రమాద వసత్తు కాలుజారి జలాశయంలోకి మునిగిపోయింది.

పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలానికి వెళ్లారు. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు జలాశయంలో గల్లంతైన మహిళ కోసం గాలింపు చేశారు. ఆమెను ప్రాణాలతో కాపాడలేకపోయారు. అప్పటికే చనిపోయినట్టుగా గుర్తించి.. మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల ఎస్ఐ రామారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details