ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుడిపై ఉపాధ్యాయుడి దాడి.. విధులు బహిష్కరించిన డాక్టర్లు

విశాఖ జిల్లా పాడేరులో వైద్యుడిపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేశాడు. మద్యం మత్తులో డాక్టరుపై దాడికి దిగాడు. దీనిపై వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

teacher attack on doctor
వైద్యుడిపై ఉపాధ్యాయుడి దాడి.. విధులు బహిష్కరించిన డాక్టర్లు

By

Published : Dec 3, 2020, 3:31 PM IST

పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యుణ్ని.. ఉపాధ్యాయుడి కొట్టిన ఘటనలో వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న వైద్యుడు అజయ్​తో.. ఓ రోగి బంధువైన ఉపాధ్యాయుడు ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో వైద్యుడిపై దాడి చేశాడు. దీనిపై డాక్టర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఎన్నో ఇబ్బందులకోర్చి ప్రజలకు సేవ చేస్తున్న తమపై ఇలాంటి దాడులు జరగడం అమానుషమన్నారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై జిల్లా అదనపు వైద్యాధికారి లీలాప్రసాద్ వైద్యులతో చర్చించారు. దాడిని ఖండించారు. దీనిపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వరరావు, ఎస్పీ రాజ్​కుమార్​లకు ఫిర్యాదు చేశారు. విధుల్లో చేరి గిరిజనులకు వైద్యం అందించాలని కోరారు. వైద్యులు పట్టువీడలేదు. లిఖితపూర్వకంగా తమకు న్యాయం జరిగేలా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టంచేశారు.

ABOUT THE AUTHOR

...view details