విశాఖ: దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని - పట్టాల మధ్య ఇరుక్కుపోయిన యువతి వైరల్ న్యూస్
09:52 December 07
ప్లాట్‌ఫాం పగలగొట్టి యువతిని బయటకు తీసిన సిబ్బంది
విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ విద్యార్థిని రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంటన్నరపాటు యవతి రైలు, ఫ్లాట్‌ఫామ్ మధ్యనే తీవ్రంగా బాధపడ్డారు. చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది... యువతిని బయటకు తీశారు. ప్లాట్‌ఫాం పగలగొట్టిన సిబ్బంది.. యువతిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రెస్క్యూ బృందం ఆమెను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న అన్నవరానికి చెందిన శశికళగా గుర్తించారు. ప్రస్తుతం యువతి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
- ఈ ఆరుగురు ఫేమస్ క్రికెటర్ల బర్త్ డే ఒకే రోజు వారెవరో తెలుసా
- కేంద్రం షాక్.. రూ.982కోట్లు వెనక్కి.. రాష్ట్ర ఆర్థికశాఖ మల్లగుల్లాలు
- తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం..దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన