విశాఖ నుంచి తిరుపతికి పాద'యాత్ర' - vishaka to tirupathi
జగన్ సీఎం అవ్వాలని కొన్నాళ్ల క్రితం ఓ అభిమాని దేవున్ని మొక్కుకున్నాడు. తన కోరిక నెరవేరినందున విశాఖ నుంచి తిరుపతికి పాదయాత్ర ప్రారంభించాడు.
విశాఖ జిల్లాకు చెందిన ఓ వైకాపా కార్యకర్త విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తే కాలినడకన తిరుపతి వస్తానని ఎన్నికలకు ముందు చోడవరం మాజీ సర్పంచ్ పొన్నపల్లి నాగేశ్వర రావు మొక్కుకున్నారు. తన కోరిక తీరినందున నాగేశ్వరరావు ఇవాళ విశాఖలోని శ్రీ సంపత్ వినాయక ఆలయం నుంచి తిరుపతి వరకూ పాదయాత్రను మొదలుపెట్టారు. చేతిలో వైకాపా జెండా పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న హామీలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాక్షించారు.