ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవంబర్​ 26న కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకత విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

ఈనెల 26న కేంద్ర వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె
ఈనెల 26న కేంద్ర వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె

By

Published : Nov 4, 2020, 6:34 PM IST

విశాఖ సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గూ నాయుడు అన్నారు. కార్మిక వర్గాల త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్​లుగా కుదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నవంబర్ 26న సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. విస్తృతంగా నగరంలో ప్రచారం నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details