రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజానీకానికి షాక్ కొడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న హోటల్‌కు ఏకంగా 21 కోట్ల రూపాయల బిల్లు రాగా.. విశాఖ జిల్లా సీలేరులో ఓ టైలర్ సోమనాథ్ ఇంటికి రూ.90వేలకు పైగా బిల్లు వచ్చింది. ఇంట్లో కేవలం 3 బల్బులు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెల 2, 3 వందల రూపాయల విద్యుత్ బిల్లు వస్తుండగా ఈసారి మాత్రం ఏకంగా రూ.90వేలకు పైగా బిల్లు రావడంతో ఆ కుటుంబం లబోదిబోమంటోంది.
SHOCK: మళ్లీ షాక్ కొట్టింది... ఈసారి సీలేరులో.. - vishaka district latest news
రాష్ట్రంలో విద్యుత్ వైర్లను తాకకుండానే..ప్రజలకు షాక్ తగులుతోంది. విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ జిల్లా సీలేరులో ఇలాంటే సంఘటనే ఓ టైలర్‌కు ఎదురైంది.
ఆ ఇంటికి వేలల్లో కరెంట్ బిల్లు
సోమనాథ్‌తోపాటు సీలేరులో పలువురి ఇళ్లకు వేలల్లో విద్యుత్ బిల్లులు వచ్చాయంటూ స్థానికులు వాపోయారు.
ఇదీ చదవండి:
CM JAGAN: రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ
Last Updated : Sep 13, 2021, 5:52 PM IST