ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల ధర్నా - paderu
విశాఖ మన్యం పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆరు నెలల బకాయిలు, యూనిఫామ్ డబ్బులకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు.
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల ధర్నా
బకాయిల కోసం ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. విశాఖ మన్యం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆరు నెలల బకాయిలు, యూనిఫామ్ డబ్బుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఏజెన్సీలో పనిచేస్తున్న 800 మంది ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.