ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో.. ఆంత్రాక్స్​ భయం

విశాఖ మన్యానికి ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. అరకులోయ మండలంలోని మాడగడ గ్రామంలో ఇద్దరు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. వారిని విశాఖ కేజీహెచ్​కు పరీక్షల నిమిత్తం తరలించారు.

2 persons_facing_antharx_disease_in_vishaka_agency

By

Published : Jul 9, 2019, 6:58 PM IST

విశాఖ మన్యంలో ఆంత్రాక్స్..​ భయం..భయం!

విశాఖ మన్యంలో ఇద్దరికి ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వారాంతపు సంతలో విక్రయించే మాంసాన్ని తినడం ద్వారా వ్యాధి సోకినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు. వీరిద్దరి రక్తనమూనాలను వైద్యనిపుణులు సేకరించి పుణేకు పంపించారు. చర్మ సంబంధిత ఆంత్రాక్స్ అయిన కారణంగా... బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. గతంలోనూ విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలి పలువురు ఇబ్బంది పడ్డారు. వ్యాధి ప్రభావిత గ్రామాన్ని సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎంహెచ్ఓ తిరుపతి రావు పరిశీలించారు. గ్రామస్థులు వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. మాంసాన్ని బాగా ఉడకబెట్టాకే తినాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details