ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచి నీళ్లనుకొని ఏడాది బాలుడు ఏం తాగాడంటే...

మంచినీళ్లు అనుకుని యాసిడ్​ తాగి పన్నెండు నెలల వయసున్న బాలుడు మృతిచెందాడు. హైదరాబాద్​ శివారు శంషాబాద్​లో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

యాసిడ్​ తాగి 12 నెలల బాలుడు మృతి

By

Published : Apr 19, 2019, 2:10 PM IST

Updated : Apr 19, 2019, 3:09 PM IST


హైదరాబాద్ నగర శివారు శంషాబాద్​లో విషాదం జరిగింది. యాసిడ్​ తాగిన పన్నెండు నెలల వయసున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంషాబాద్ పట్టణంలోని హైమాద్ నగర్ కాలనీకి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి ఇంటి అవసరాల కోసం యాసిడ్​ బాటిల్​ తెచ్చాడు. అతని కుమారుడు ఆజాం బుధవారం సాయంత్రం నీళ్లు అనుకుని తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిలోఫర్​ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అకాల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Last Updated : Apr 19, 2019, 3:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details