ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాల్మీకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి'

ఎటువంటి కుల వృత్తి లేని వాల్మీకులకు జగనన్న'చేదోడు పథకం' వర్తించడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి స్పందించి వాల్మీకులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.

కర్నూలులో తెదేపా ఎమ్మెల్సీ బిటి.నాయుడు ప్రెస్​మీట్​
కర్నూలులో తెదేపా ఎమ్మెల్సీ బిటి.నాయుడు ప్రెస్​మీట్​

By

Published : Jun 12, 2020, 1:08 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్​ రెడ్డి పాదయాత్రలో వాల్మీకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు కోరారు. ఎలాంటి కుల వృత్తి లేని వాల్మీకులకు జగనన్న 'చేదోడు పథకం' వర్తించడం లేదన్నారు. ఈ విషయమై సీఎం జగన్​ స్పందించి వాల్మీకులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియెజకవర్గంలో పోలీసులు.... వాల్మీకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'అన్యాయాలు, అరాచకాలు బయటపెడుతున్నందుకే అరెస్టులు'

ABOUT THE AUTHOR

...view details