ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హస్తినలో 'హోదా' పోరు - dharma poratam

ప్రత్యేక హోదా , విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హస్తిన వేదికగా చంద్రబాబు తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు అంతా సిద్ధమైంది. తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని దేశానికి తెలియేజేసేందుకు ముఖ్యమంత్రి సమాయత్తమయ్యారు. ఏపీ పై ప్రధాని మోదీ చూపిస్తున్న వివక్షను ఎండగట్టనున్నారు.

చంద్రబాబు

By

Published : Feb 11, 2019, 12:19 AM IST

Updated : Feb 11, 2019, 6:48 AM IST

దిల్లీపై దండయాత్రముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక హోదా , విభజన హామీల అమలులో కేంద్రం చేసిన నమ్మకద్రోహం దేశప్రజలకు తెలిపే ఉద్దేశంతో దీక్ష చేపడుతున్నారు. ఏపీ భవన్ వేదికగా 12 గంటల పాటు సీఎం నిరాహారదీక్ష చేయనున్నారు. ఉదయం 7 గంటలకు రాజ్ ఘాట్ లో మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం ఏపీ భవన్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు. 8 గంటలకు దీక్ష ప్రారంభించి రాత్రి 8 గంటలకు ముగించనున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దిల్లీకి చేరుకున్నారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర విద్యా సంస్థలు, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం కోసం పోరాడనున్నారు. కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ విస్మరణపై సీఎం ప్రశ్నించనున్నారు. దీక్షకు జాతీయ స్థాయి నేతలు మద్దతు తెలుపనున్నారు. ఇప్పటికే తెదేపా నేతలు.. రెండు, మూడు రోజుల నుంచి అక్కడే ఉండి దీక్ష ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జేఏసీలు, పార్టీల నాయకులు , విద్యార్థి సంఘాల నేతలు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హస్తినకు చేరుకున్నారు. వీరికి వసతితో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దిల్లీపై దండయాత్ర
Last Updated : Feb 11, 2019, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details