- కాస్త ఉపశమనం: క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్ఫ్యూ, 144 సెక్షన్‌తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్
రాష్ట్రంలో ఇప్పటివరకూ 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో కరోనా కేసుల పెరుగుదల తగ్గుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని 66 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు : వాతావరణ శాఖ
మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు రాకకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనాథ చిన్నారులకు పీఎం కేర్స్ నుంచి రూ.10 లక్షలు!
కొవిడ్ మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్' ద్వారా సాయం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనాథలకు అండగా సీఎం- రూ. 5లక్షల సాయం
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆపన్నహస్తం అందించేందుకు తమిళనాడు సర్కారు ముందుకొచ్చింది. అనాథలైన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి రోగి మృతి