ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 11AM - ఏపీ ప్రధాన వార్తలు

.

top news
top news

By

Published : May 31, 2021, 11:00 AM IST

  • కృష్ణపట్నంలో కరోనా... మరో 27 మందికి స్వల్ప లక్షణాలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి

కరోనాతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతి చెందారు. కరోనాతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో చేరిన కోటయ్య...నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. కరోనా సోకిన తర్వాత కోటయ్య ఆనందయ్య ఔషధం తీసుకున్నారు.ఔషధం తీసుకున్నాక కోలుకున్నట్లు గతంలో కోటయ్య ప్రకటనతో ఆనందయ్య ఔషధం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • డీజీపీ పేరిట.. ట్విటర్‌లో నకిలీ ఖాతా!

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ట్విటర్‌లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం ట్విటర్‌కు ఫిర్యాదు చేసి ఈ ఖాతాను స్తంభింపజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనా కాలంలోనూ.. ప్రత్యేకతను చాటుతున్న స్విమ్స్‌!

విపరీతమైన పనిభారంతో కరోనా మినహా మిగిలిన వైద్యసేవలను ఆసుపత్రులు రద్దు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలోనూ తితిదే ఆధ్వర్యంలోని స్విమ్స్‌ ఆసుపత్రి మాత్రం.. తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏడాదిన్నరగా డయాలసిస్‌ సేవలను నిరాటంకంగా కొనసాగిస్తూ.. రోగుల పాలిట ఆరోగ్యప్రదాతగా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశంలో కొత్తగా 1.52లక్షల మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు(coronavirus india) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,52,734 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారిన పడి మరో 3,128 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు

పెళ్లి పీటల మీదే వధువు మృతి చెందిన క్రమంలో.. వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. అయితే, పెళ్లికి వచ్చిన బంధువులు, చేసిన ఖర్చు దృష్ట్యా వివాహం ఆగిపోకూడదనే తాము ఇలా చేసినట్లు ఇరు కుటుంబాల పెద్దలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మయన్మార్​ నిరసనల్లో 840 మంది మృతి

మయన్మార్ (myanmar)​ నిరసనల్లో ఇప్పటివరకు 840 మంది మృతిచెందారని ఆసిస్టెన్స్​ అసోసియేషన్ ఆఫ్​ పొలిటికల్ ప్రిజనర్స్​ (ఏఏపీపీ) వెల్లడించింది. 4,409 మంది నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మే నెలలో 16వ సారి పెట్రో బాదుడు

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్(petrol price​)పై 22 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్​కు రూ.94.23కి చేరింది. ఒక్క మే నెలలోనే 16 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కొత్త జెర్సీతో భారత మహిళా క్రికెట్​ జట్టు

ఇంగ్లాండ్​తో జరగబోయే సిరీస్​లో భాగంగా టెస్టు మ్యాచ్​ కోసం కొత్త జెర్సీ ధరించి ఆడనుంది భారత మహిళా క్రికెట్​ జట్టు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ(BCCI) సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విమాన ప్రమాదంలో 'టార్జాన్' నటుడు మృతి

'టార్జాన్'( tarzan) నటుడు జో లారా(joe lara) , అతడి కుటుంబ సభ్యులు విమాన ప్రమాదంలో మరణించారు. వీరు ప్రయాణిస్తున్న బిజినెస్ జెట్​ సరస్సులో కుప్పకూలిపోవడం వల్ల అందరూ మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details