TTD: కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా రద్దు చేసిన వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు తితిదే పునరుద్ధరించింది. వృద్ధులు, వికలాంగులు ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో ఏప్రిల్ ఒకటిన విడుదల చేయాల్సిన దర్శన టోకెన్లను శుక్రవారానికి వాయిదా వేశారు.
Tirumala: తిరుమలలో వారికి ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ.. ఇవాళ్టి నుంచి టోకెన్లు - తిరుమల తాజా వార్తలు
TTD: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు తితిదే పునరుద్ధరించింది. వృద్ధులు, వికలాంగులకు ఏప్రిల్ 9 నుంచి నెల చివరి వరకు రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్లు జారీ
ఏప్రిల్ తొమ్మిది నుంచి నెల చివరి వరకు రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో టోకెన్లు పొందిన భక్తులను ప్రతిరోజూ ఉదయం 10 గంటల సమయంలో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దర్శనానికి అనుమతిస్తారు.
ఇదీ చదవండి:TTD: తిరుమలలో దళారుల చేతివాటం.. ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసాలు.. కేసు నమోదు