ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ramana Dikshitulu: ఆ వివాదాస్పద ట్వీట్​తో మరోసారి వార్తల్లోకి రమణ దీక్షితులు

Ramana Dikshitulu: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎం జగన్​ తిరుమల పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు చేసిన ఓ వివాదాస్పద ట్వీట్​ చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్​లో ఏముందంటే..?

Ramana Dikshitulu
రమణదీక్షితులు

By

Published : Sep 28, 2022, 4:56 PM IST

Updated : Sep 28, 2022, 7:47 PM IST

Ramana Dikshitulu: తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ తిరుమల రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్ చేశారు. తితిదేలోని బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతో పాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ఆయన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం సీఎం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ముఖ్యమంత్రి తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లిన కొన్ని గంటల్లోనే రమణ దీక్షితులు ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి వన్​మెన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రకటన చేస్తారని భావించారని రమణదీక్షితులు ట్వీట్​లో ప్రస్తావించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడం అర్చకులను తీవ్ర నిరాశపర్చిందన్నారు. ఆలయ విధానాలను, అర్చక వ్యవస్థను నాశనం చేయకముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రమణదీక్షితులు ట్వీట్

ట్వీట్​పై ఆలయ అర్చకుల స్పందన: రమణ దీక్షితులు ట్వీట్‌పై శ్రీవారి ఆలయ అర్చకులు స్పందించారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అర్చకులు అన్నారు. ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియదని తెలిపారు. వైభవంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగా ఉందని స్పష్టం చేశారు. 142 సెక్షన్ ప్రకారం క్రమబద్ధీకరించారని చెప్పారు. తమ పిల్లలకూ శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇచ్చారన్నారు. కమిటీ నివేదిక మేరకు మిరాశీలను ఉద్యోగులుగా తీసుకున్నారని పేర్కొన్నారు. 1997నుంచి సంభావన అర్చకులుగా పనిచేస్తున్నారని అన్నారు. జీవో నెం.855 ప్రకారం తమ సేవలను క్రమబద్ధీకరించారని, సెక్షన్ 142 ప్రకారం మాకు గౌరవ మర్యాదలు అందుతున్నాయని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు.

"రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియదు. వైభవంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నాం. తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగా ఉంది. 142 సెక్షన్ ప్రకారం క్రమబద్ధీకరించారు. మా పిల్లలకూ శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. కమిటీ నివేదిక మేరకు మిరాశీలను ఉద్యోగులుగా తీసుకున్నారు. 1997నుంచి సంభావన అర్చకులుగా పనిచేస్తున్నారు. జీవో నెం.855 ప్రకారం మా సేవలను క్రమబద్ధీకరించారు. సెక్షన్ 142 ప్రకారం మాకు గౌరవ మర్యాదలు అందుతున్నాయి." -ఆలయ అర్చకులు

ఇవీ చదవండి:

Last Updated : Sep 28, 2022, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details