Police Arrested Accused in Inhuman Incident in Tirupati District: తిరుపతి జిల్లా చంద్రగిరిలో వంశీకి శిరోముండనం చేయించిన హర్షా రెడ్డి, అన్వర్లు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. రాత్రి బాధితుడు వంశీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనటో అన్వర్, హర్షా రెడ్డిలకు.. మొదట నుంచీ ఓ కానిస్టేబుల్ సహకారం అదించాడని సమాచారం. హర్షా రెడ్డి, అన్వర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి సహకరించిన కానిస్టేబుల్ వివరాలు కూడా తెలుసుకునే పనిలో పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం ఏరంగంపేటకు చెందిన హరికృష్ణ నాయుడి కుమారుడు వంశీ. వంశీ చంద్రగిరిలో ఆటోను అద్దెకు తీసుకొని.. నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో.. మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. వివాహానికి దారి తీసింది. దీంతో ఆటో యజమాని అయిన అన్వర్.. వంశీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అన్వర్.. వంశీ భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.
పుట్టింటికి వెళ్తున్నానని అన్వర్ వద్దకు: దీంతో వంశీ భార్య రెండు నెలల క్రితం.. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి.. అన్వర్ వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో వంశీ ఆటోను వదిలి బెంగళూరులో కూలి పని చేసుకోవడానికి వెళ్లాడు. తన భార్య అన్వర్ వద్దకు వెళ్లిందనే విషయం తెలుసుకున్నాడు వంశీ. ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని విచారణ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాడు. దీంతో వంశీ తీవ్ర కోపంతో .. ఫేస్‌బుక్‌లో తన భార్య, ఆమె ప్రియుడు అయిన అన్వర్ చనిపోయినట్లు 'రిప్' అని ఓ పోస్ట్ షేర్ చేశాడు.