ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gang Arrested: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు - Liquid Marijuana

Liquid Marijuana Moving Gang Arrest: ద్రవరూప గంజాయి తరలిస్తున్న బృందాన్ని తిరుపతి జిల్లా పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1 కిలో 435 గ్రాముల లిక్విడ్ గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ డీఐజీ రవిప్రకాశ్​ తెలిపారు.

ద్రవరూప గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/13-April-2022/15008683_ganja33.png

By

Published : Apr 13, 2022, 5:40 PM IST

లిక్విడ్ గంజాయి తరలిస్తున్న బృందాన్ని పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను నుంచి లిక్విడ్ గంజాయి, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ డీఐజీ రవిప్రకాశ్​ తెలిపారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రవరూప గంజాయి రవాణాపై వివరాలు వెల్లడించారు.

పుత్తూరులోని చర్చి కాంపౌండ్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన డీఐజీ.. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. నిందితుల నుంచి 1 కిలో 435 గ్రాముల లిక్విడ్ గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో అనంతపురానికి చెందిన మోహన్ కృష్ణ, అజయ్ కుమార్, తమిళనాడుకు చెందిన లోకేష్, ప్రశాంత్ ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాలో పోలీసు ఉద్యోగి మోహన్ కృష్ణ ప్రమేయం ఉండటంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు డీఐజీ తెలిపారు.

పోలీసు తనిఖీల నేపథ్యంలో ప్రస్తుతం గంజాయి ఆకు తరలించడం కష్టంగా మారడంతో.. నిందితులు ద్రవరూపంలోకి మార్చి తరలిస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలతో యువత నిర్వీర్యమవుతోందని.. విద్యాసంస్థలు ఎక్కువ ఉన్నచోట దీని వినియోగం ప్రమాదకరమన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Arrest: యువకుడి ఆత్మహత్య కేసులో.. సర్పంచి సహా ఐదుగురి అరెస్ట్‌

ABOUT THE AUTHOR

...view details