Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న వారిలో భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, జేఎమ్‌డీ సుచిత్ర ఎల్ల సైతం స్వామి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇరువురికి స్వాగతం పలికి వైకుంఠ ద్వార దర్శనం చేయించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈనెల 9న శ్రీవారి ప్రత్యేక దర్శనం టిెకెట్లు విడుదల.. స్వామివారి సేవలో ప్రముఖులు - టీటీడీ వార్తలు
Former CJI Justice NV Ramana: ఈరోజు తిరుమల శ్రీవారిని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, జేఎమ్‌డీ సుచిత్ర ఎల్ల సైతం స్వామి సేవలో పాల్గొన్నారు. వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్ల ను జనవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను జనవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300ల టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేయడంతో, ఈ నెల 12 నుంచి 31 వరకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను 9వ తేదీన విడుదల చేస్తున్నామని తితిదే అధికారులు వివరించారు.
ఇవీ చదవండి: