ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలక్ట్రిక్​ వాహనంలో మంటలు, వాహనదారుడికి తప్పిన ప్రమాదం - వాహనదారుడు సురక్షితం

Fire in Electric Vehicle ఏదో ఒకచోట బ్యాటరీ వాహనాల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. సాంకేతిక సమస్యలో బ్యాటరీ ఎక్కువ ఛార్జింగ్​ పెట్టడమో కానీ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలతో ఇలాంటి వాహనాలు నడపాలంటే వాహనదారులు భయపడుతున్నారు. తాజాగా తిరుపతిలో బ్యాటరీ వాహనంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. స్థానికులు స్పందించడంతో వాహనదారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

fire in electric vehicle
fire in electric vehicle

By

Published : Aug 16, 2022, 10:21 PM IST

Electric Vehicle Burnt in Tirupati: తిరుపతి నగరంలో బ్యాటరీతో నడిచే వాహనంలో మంటలు చెలరేగాయి. రైల్వేకాలనీకి చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడు తన మూడు చక్రాల వాహనంలో బయటకు వెళ్లేందుకు స్టార్ట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంపై కూర్చొని స్టార్ట్ బటన్ నొక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలు రావడంతో వాహనంపై కూర్చున్న వ్యక్తి పక్కకు ఒరిగారు. ఘటనను గమనించిన స్ధానికులు స్పందించి ప్రత్యేక ప్రతిభావంతుడిని పక్కకు తరలించారు. ఉవ్వెత్తున లేచిన మంటల్లో వాహనం కాలిబూడిదయింది. స్ధానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఎలక్ట్రిక్​ వాహనంలో మంటలు, వాహనదారుడికి తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details