Srikalahasti CI Behavior: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వాహరాలిపై సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తించారు. రాత్రి 10 గంటలకు హోటల్ మూత వేయడం లేదని.. ధనలక్ష్మిపై సీఐ దాడికి దిగారు. రోడ్డుపైనే బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ తరలించారు. బాధితురాలు తనకి ఇటీవలే ఆపరేషన్ అయ్యిందన్నా.. సీఐ అంజూ యాదవ్ వినిపించుకోలేదు. నెల వారి మామూలు ఇవ్వలేదనే.. అక్కసుతోనే తన భార్యపై సీఐ దాడికి దిగిందని హోటల్ నిర్వహకురాలి భర్త ఆరోపించారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. దురుసుగా ప్రవర్తించిన అధికారిణి తీరును ఖండించారు. సీఐ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.
హోటల్ నిర్వహకురాలిపై దురుసుగా ప్రవర్తించిన సీఐ.. స్పందించిన డీఎస్పీ
Srikalahasti: శ్రీ కాళహస్తి పట్టణంలో హోటల్ నిర్వహకురాలిపై సీఐ దురుసుగా ప్రవర్తించారు. సమయం దాటిపోయిన హోటల్ మూసి వేయటం లేదని సీఐ దాడికి దిగారు. హోటల్ నిర్వహకురాలి ఆరోగ్య స్థితి బాగాలేదని చెప్పిన వినిపించకోకుండా సీఐ స్టేషన్కు తరలించారని నిర్వహకురాలి భర్త ఆరోపించాడు.
Etv Bharat
స్పందించిన డీఎస్పీ:హోటల్ నిర్వహకురాలిపై సీఐ దాడి చేసిన ఘటనపై శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ స్పందించారు. దాడి సంబంధించి సమాచారం సామాజిక మాద్యమాల ద్వారా సమాచారం అందిందని ఆయన తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఆయన పేర్కోన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఇవీ చదవండి: