Cheetah Spotted In Seshachalam Forest: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట అటవీ సమీప ప్రాంతాల్లో చిరుత పులి సంచారంతో రైతులు, పశు కాపర్లు భయాందోళనలో ఉన్నారు. శేషాచల అటవీ ప్రాంతాల్లోని రాగిమాకుల గుంట పెద్దపల్లి తోపు ప్రాంతాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డి చంద్రబాబు అనే రైతు పశువులు, మేకల మందతో అటవీ సమీప ప్రాంతాల్లో తన పొలం వద్ద ఉంచుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో చిరుతపులి మేకపిల్లను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిచడంతో రైతు అప్రమత్తమై కేకలు వేయడంతో మేకపిల్లను వదలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. మేకపిల్ల మెడ భాగంలో చిరుత గాయపరచడంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాణసంచాలు కాలుస్తూ రైతులను అప్రమత్తం చేశారు.
తిరుపతి జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
Cheetha Spotted In Seshachalam Forest: తిరుపతి జిల్లాలో చిరుత పులి సంచరించటంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు రైతులను అప్రమత్తం చేశారు. వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిరుతపులి
అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ చిరుత పులి సంచారం సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను అప్రమత్తం చేశామని.. అప్రమత్తంగా ఉండి చిరుత కనిపిస్తే తమకు సమాచారమివ్వాలన్నారు. కొద్దిరోజుల పాటు అడవులలో మేతకు మూగజీవాలను తీసుకెళ్లరాదని.. అటవీ సమీప ప్రాంతాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. పై అధికారులకు సమాచారం అందించిన అటవీశాఖ అధికారులు గస్తీ ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి