Babu Rajendra Prasad demands: సర్పంచులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర వ్యవస్ధాపక అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడుతూ అలిపిరి వద్ద సర్పంచులు తలపెట్టిన శాంతియుత సమరశంఖారావం కార్యక్రమానికి పోలీసులు దమనకాండను ఊపయోగించారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బలవంతంగా అరెస్టులు చేయడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు.
సర్పంచుల న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలి: బాబూ రాజేంద్రప్రసాద్
Babu Rajendra Prasad: రాష్ట్రంలో సర్పంచులు తమ కష్టాలను తెలిపేందుకు.. కాలినడకన తిరుమలకు పాదయాత్రగా చేపడితే అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఉదయం రాష్ట్ర సర్పంచుల సంఘం సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. సర్పంచుల కోరుతున్న 12 న్యాయబద్దమైన డిమాండ్లను నెరవేర్చేలా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు.
శాంతియుతంగా కాలినడకన తిరుమలకు వెళుతున్న సర్పంచులను, రాష్ట్ర నాయకులను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తితిదే, పీఠాధిపతులు, భాజపా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అటంకం కలిగించినప్పటికీ.. 60 మంది సర్పంచులు, రాష్ట్ర నాయకులు శ్రీవారిని దర్శించుకుని సమరశంఖారావం పూరించామని తెలిపారు. 12 డిమాండ్లు తమ కోసం కాదని.. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల అభివృద్ది కోసమని ఆయన అన్నారు. సర్పంచులు గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని పిలుపునిచ్చారు. పాత పద్దతిలోనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: