Attack On Janasena Party Office: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా 30 మంది వైకాపా కార్యకర్తలు.. కార్యాలయంలోకి దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. కార్యాలయంలో కుర్చీలు, బల్లలు విరగొట్టారు. ఫర్నిచర్‌ను కర్రలతో కొడుతూ ధ్వంసం చేయడంతో.. చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైకాపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని.. నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ అనుచరులే దాడికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై వైకాపా కార్యకర్తల దాడి.. ఫర్నిచర్ ధ్వంసం - ysrcp attack news
YSRCP Activists Attacks: వైకాపా, జనసేన పార్టీ అధినేతల మధ్య విమర్శల వర్షం కురుస్తున్న వేళ.. వైకాపా కార్యకర్తలు నేరుగా జనసేన పార్టీ కార్యాలయం పైన దాడికి దిగారు. శ్రీకాకుళం జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంపై శుక్రవారం వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారి పార్టీ కార్యాలయంపై దాడికి దిగి కార్యాలయంలోని ఫర్నిచర్ ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
జనసేన పార్టీ కార్యాలయంపై దాడి
Last Updated : Oct 21, 2022, 10:53 PM IST