ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రౌతు లక్ష్మీపురం నామినేషన్‌ కేంద్రంలో వైకాపా నాయకుల అలజడి - శ్రీకాకుళం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం నామినేషన్ కేంద్రంలో వైకాపా నాయకులు అలజడి సృష్టించారు. తెదేపా అభ్యర్థి నవీన్​ను.. వైకాపా నాయకుడు ఎం. శ్యామ్ సుందర్​ రావు అడ్డిగించారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా ఇంటికి పంపించారు.

Vaikapa leaders' agitation at Routhu Lakshmipuram nomination center
రౌతు లక్ష్మీపురం నామినేషన్‌ కేంద్రంలో వైకాపా నాయకుల అలజడి

By

Published : Feb 1, 2021, 12:01 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం రమదళ గ్రామ పరిధిలో వైకాపా నాయకులు అలజడి సృష్టించారు. రౌతు లక్ష్మీపురం నామినేషన్ కేంద్రం వద్ద తెదేపా అభ్యర్థి నవీన్.. నామివేషన్ వేయడాకి వెళ్లగా... వైకాపా నాయకుడు ఎం. శ్యామ్ సుందర్ రావు అడ్డగించారు. ఆయన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయకుండా ఇంటికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి నవీన్.. విషయాన్ని నివేదించారు. వెంటనే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, జిల్లా కలెక్టర్ కు

దీంతో నవీన్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి ఫిర్యాదు చేయగా.. ఆయన ఎన్నికల కమిషనర్.... జిల్లా కలెక్టర్​కు ఫోన్​లో సమాచారం అందించారు. స్పందించిన కలెక్టర్.. నామినేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ను ఆదేశించారు. తహసీల్దార్ కాళీ ప్రసాద్ గ్రామానికి వెళ్లి నవీన్​తో... రౌతు లక్ష్మీపురం కేంద్రంలో నామినేషన్ వేయించారు. అనంతరం నామినేషన్ వేయకుండా ఆపిన వైకాపా నాయకుడు ఎం. శ్యామ్ సుందర్ రావుపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.

ABOUT THE AUTHOR

...view details