ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రార్థనా మందిరంలోనూ వైకాపా నేతల ప్రచారం - canva

పార్టీ ప్రచారానికి ప్రార్థనా మందిరాన్నీ వదల్లేదు వైకాపా నేతలు. ఎన్నికల నిబంధనలను లెక్క చేయకుండా దైవ నామ స్మరణ వినిపించాల్సిన చోట.. ఓట్లు అభ్యర్థించారు.

చర్చిలో వైకాపా నేతల ప్రచారం

By

Published : Apr 8, 2019, 7:04 AM IST

శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు ఏకంగా చర్చిలోనే ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రార్థనా మందిరంలోనే పార్టీ ప్రచారాన్ని నిర్వహించి స్థానికంగా కలకలం స్పష్టించారు. స్థానిక నేతలతో కలిసి గార సంతతోట సమీపంలోని చర్చిలోకి వెళ్లి పార్టీకి ఓటు వేయాలని అక్కడి వారిని అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచారానికి సంబంధించిన వీడియోను నియోజకవర్గ నిఘా బృందానికి అందజేసింది.

చర్చిలో వైకాపా నేతల ప్రచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details