మహిళలు, చిన్నారులు ఆహార భద్రత పాటించేలా అంగన్వాడి కార్యకర్తలు కృషి చేయాలని పోషన్ అభియాన్ స్వాస్థ్ అధికారి కె.సౌమ్య సూచించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తోన్న అంగన్వాడి సిబ్బందికి ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఆహార భద్రత విలువలను పాటించేందుకు అంగన్వాడి కార్యకర్తల కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారి అనంతలక్ష్మి పాల్గొన్నారు.
నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన - poshan Abhiyan
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం