శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞానం ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ, కలెక్టర్ నివాస్ హాజరయ్యారు.
మండల ప్రధాన కేంద్రాలు, గ్రామ స్థాయిల్లో మహిళా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ వివాహ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కు అంశాలను వివరించారు. ఇళ్ల వద్దకే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.