ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

108 సిబ్బంది చాకచక్యం..వాహనంలోనే గర్భిణీ ప్రసవం - ఇచ్చాపురంలో 108లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

108 వాహనంలోనే ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆవేటి బలరాంపురంలో ఈ ఘటన జరిగింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

woman delivery in 108 at aveti balarampuram, woman delivered baby in 108 vehicle
ఆవేటి బలరాంపురంలో 108లో ప్రసవించిన మహిళ, 108 వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

By

Published : Mar 27, 2021, 10:15 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆవేటి బలరాంపురానికి చెందిన బాకి కుమారి 108లోనే ప్రసవించింది. రెండవ కాన్పు కోసం పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి వెళ్లింది. గర్భంలో శిశువు పెద్దదిగా ఉండటంతో ప్రసవం కష్టమని వైద్యులు నిర్ధరించారు.

బ్రహ్మపురం వైద్యకళాశాలకు ఆమెను అంబులెన్స్​లో తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది చాకచక్యంగా ప్రసవం చేయడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పురుడుపోసిన ఉద్యోగులను ఆమె బంధువులు అభినందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details