ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంపై అవాకులు పేలితే చూస్తూ ఊరుకోం: మంత్రి అప్పలరాజు - మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను తెదేపా నేతలు వక్రీకరించడాన్ని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తప్పుబట్టారు. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంత్రి అప్పలరాజు హెచ్చరించారు.

నోరు అదుపులో పెట్టుకోండి.. లేదా కొవ్వు కరగిస్తాం : మంత్రి అప్పలరాజు
నోరు అదుపులో పెట్టుకోండి.. లేదా కొవ్వు కరగిస్తాం : మంత్రి అప్పలరాజు

By

Published : Oct 5, 2020, 8:18 AM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను తెదేపా వక్రీకరించిందని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు తప్పుబట్టారు.

'అవాకులు చెవాకులు ఎందుకు ?'
ముఖ్యమంత్రి జగన్​పై జిల్లాకు చెందిన తెదేపా నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని జిల్లా కేంద్రంలోని వైకాపా కార్యాలయంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి దురుసుతో ఇష్టారీతిన ప్రవర్తిస్తునారని మండిపడ్డారు.

ఎంపీ ఏడీ ?
ఆరు నెలలుగా ఎక్కడున్నారో తెలియని ఎంపీ రామ్మోహన్ నాయుడుకు.. ఇప్పుడు కరోనా గుర్తొచ్చిందా అని అప్పలరాజు ప్రశ్నించారు.

బీసీలతోనే బీసీలకు..
బీసీలతోనే బీసీల కళ్ళు పొడిచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. బీసీ ప్రజలు, నేతలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తెదేపా నాయకులు మాటలను నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు లేరన్నారు. అమరావతిలో జరిగేది ముమ్మాటికి పెయిడ్ ఆర్టిస్టుల ఆందోళనే అని మంత్రి స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం మీద కాని ముఖ్యమంత్రి జగన్​ మీద కానీ ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.

ఇవీ చూడండి : మావోయిస్టుల ఏరివేతకు పోలీసు ఉన్నతాధికారులు వ్యూహరచన..!

ABOUT THE AUTHOR

...view details