ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి చెలమలే దిక్కు... దాహార్తి తీర్చేను మాకు

నదీ పరివాహక ప్రాంతాల్లో తాగునీటి కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి చెలిమెలే ప్రజలకు దిక్కయ్యాయి.

నీటి చెలిమెలే వారికి దిక్కు

By

Published : Apr 20, 2019, 8:54 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం టి. బరంపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉంటున్నా... తాగడానికి గుక్కెడు నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు. నదీ గర్భంలో ఏర్పాటు చేసుకున్న చెలమల నీరే అక్కడివారికి దిక్కయ్యాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా... తమ తలరాత మారటం లేదని బరంపురం గ్రామస్థులు వాపోతున్నారు. నీటి కష్టాలు తీర్చే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి చెలిమెలే వారికి దిక్కు

ABOUT THE AUTHOR

...view details