ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరవు రోజుల్లో.. కడుపు నింపుతున్న "ఉపాధి హామీ"!

లాక్ డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బంది పడుతున్న కూలీలు.. ప్రభుత్వం తిరిగి ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పనుల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఉపాధి పొందుతూ కాస్తయినా ఆర్థిక సమస్యలు తీర్చుకుంటున్నారు.

villagers in srikakulam dst are doinggramina upadhi works maintaing social distance
villagers in srikakulam dst are doinggramina upadhi works maintaing social distance

By

Published : May 16, 2020, 9:02 AM IST

శ్రీకాకుళం జిల్లా రూరల్ మండల పరిధిలోని పేదలు... కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లాక్ డౌన్ వల్ల కూలీ పనులు చేసుకునేవారు, ఇంటికే పరిమితమైన కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.

ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఉపాధి కల్పించిన కారణంగా... మండుటెండలను సైతం లెక్కచేయకుండా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేస్తున్నారు. కాస్తయినా ఆర్థిక సమస్యలు తీరుతున్నాయని ఆనందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details