Vamsadhara Residents Demand Compensation: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు కోడలి వద్ద వంశధార నిర్వాసితులు రాస్తారోకో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింహాచలం, అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో వంశధార నిర్వాసితులు నిరసన చేపట్టి... రహదారిపై బైఠాయించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. నేటికి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి అదనపు పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరిహారం విషయంలో సీఎం హామీ విస్మరించారు: వంశధార నిర్వాసితులు - శ్రీకాకుళం వార్తలు
Vamsadhara residents demand compensation: పరిహారం కోసం వంశధార నిర్వాసితులు నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని తెలిపారు. తమకు వెంటనే పరిహారం అందజేయాలని కోరారు.
వంశధార నిర్వాసితులు