శ్రీకాకుళంలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం - శ్రీకాకుళం వార్తలు
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దివ్య రూపాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోయారు. అలాగే శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అనంతరం ఆదిత్యుని దివ్య రూపం వీక్షించి... పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రత్యేక పుష్పాలంకరణతో అలంకరించారు. ఉషా, పద్మినీ, ఛాయ సమీత సూర్యనారయణ స్వామి ఉత్సవమూర్తులకు ఆలయ అనివెట్టి మండపంలో కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. అలాగే శ్రీ కూర్మంలోని శ్రీ కూర్మనాధస్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు వీక్షించి దర్శనం చేసుకున్నారు.