ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఉపాధి హామీ పనులు

శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. చెరువులు, కాలువలు తవ్వడం వంటి పనులు కూలీలు ఉత్సాహంగా చేస్తున్నారు. విపరీతంగా మండుతున్న ఎండలకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూలీలు మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

By

Published : Jun 1, 2019, 12:45 PM IST

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఉపాధి పనులు

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఉపాధి పనులు

శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు బయలుదేరి పనులకు వెళుతున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలనుంచి 6 గంటల వరకు చెరువులు, కాలువలు తవ్వడం వంటి పనులు చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నందున అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పనిచేసే స్థలం వద్ద మంచినీరు, మజ్జిగ, మందులు, విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు అందుబాటులో ఉంచారు. దీంతో కూలీలు పనులు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details