ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారు దుకాణంలో చోరీ... 100 గ్రాముల బంగారం అపహరణ - శ్రీకాకుళం పాలకొండ బంగారు దుకాణంలో చోరి

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో చోరీ జరిగింది. నాయుడు జ్యువెల్లర్స్ దుకాణంలో... 40 కిలోల వెండి ఆభరణాలు ,100 గ్రాముల పైగా బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

theft in gold shop at palakonda in srikakulam
పాలకొండలోని బంగారు దుకాణంలో చోరి

By

Published : Jun 19, 2020, 10:31 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ రహదారిలో... గురువారం రాత్రి చోరీ జరిగింది. నాయుడు జ్యువెలర్స్ దుకాణం షట్టర్​ను పగలగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని 40 కిలోల వెండి ఆభరణాలు ,100 గ్రాములకు పైగా బంగారం అపహరణకు గురైనట్లు యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో దొందతనం జరగడం పై స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ.. లక్షల్లో నగదు మాయం

ABOUT THE AUTHOR

...view details